ప్రజావాణి కి 48 ఫిర్యాదులు 48 complaints to Prajavani

ప్రజావాణిలో  ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్.
ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్.

ప్రజావాణి కి 48 ఫిర్యాదులు

నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 48 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలను అందజేశారు. స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ప్రజల నుంచి అర్జీలను సేకరించి, వారి సమస్యలను సావధానంతో విన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. శాఖల వారీగా ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment