గౌరవ నారాయణపేట జిల్లా కలెక్టర్, నారాయణపేట గారి ఆదేశాల ప్రకారం తేదీ 6.11.2025 గురువారం రోజున మధ్యాహ్నం గం 1:00లకు ఎస్. ఆర్ . గార్డెస్ ఫంక్షన్ హాల్ నారాయణపేట, (పాత జిల్లా ఆసుపత్రి పక్కన) బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పూజారులు, పాస్టర్స్, ఖ్వాజీలు మరియు జిల్లా లోని ఫంక్షన్ హాల్ యజమానులు, టెంట్ హౌస్ యజమానులు. సౌండ్ సిస్టమ్స్ మరియు డీజే నిర్వాహకులు క్యాటరింగ్ యజమానులు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు మరియు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లు అందరు కూడా ఈ అవగాహన కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. కావున పైన పేర్కొన్న వారందరు ఈ అవగాహన సమావేశానికి తప్పక హాజరు అయ్యి విజయవంతం చేయాలని తెలియజేయనైనది.