
కోసం న్యాయవాదులు సకరించాలి ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.
సోమవారం నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ న్యాయవాదులతో మాట్లాడు నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుననీ న్యాయవాదులకు ఈ సందర్బంగా తెలిపారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, N.I. యాక్ట్ కేసులు, మ్యాట్రిమోనియల్ వివాదాలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు, సివిల్ కేసులు మరియు బ్యాంక్ రికవరీ సూట్లకు సంబంధించి కేసులను రాజ మార్గం ద్వారా, పరిష్కారం పొందేలా చూడమని ఈ సందర్భంగా న్యాయమూర్తులకు మరియు న్యాయవాదులు అధికారులకు రాజిమార్గం ద్వారా కేసులను పరిష్కరించాలని తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు న్యాయవాదులు తీసుకోవాలన్నారు.
సెప్టెంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు తెలిపారు.
ఈ సమావేశంలో న్యాయమూర్తులు శ్రీ బోయ శ్రీనివాసులు, సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ DLSA శ్రీమతి వింధ్య నాయక్, శ్రీ బి. మనోజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు నారాయణపేట బార్ అస్సోసికేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.