
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS.
నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్లో నేడు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యత, నేరల నియంత్రణ పై చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలుఅందించాలి అని ఎస్పి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, పోలీస్ అధికారులంతా బాధ్యతగా పని చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు. పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, విసబుల్ పోలీసింగ్ విధులు నిర్వర్తించాలని తెలిపారు. నిషేధిత గంజాయి అక్రమరవాణా, మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు, అవి నిరంతరం పనిచేసే విధంగా మానిటర్ చేయాలని సూచించారు. దొంగతనల కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి లాంగ్ పెండింగ్ కేసులలోని నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్),వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నారాయణపేట జిల్లా పరిధిలో మండల కేంద్రాల్లో ట్రాఫిక్ పోలీసులను నియమించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అలాగే ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మద్యం సేవించి వాహనాలను రాష్ గా నడుపుతూ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు గ్రామలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ సామాజిక అంశాల పై అవగాహన కల్పించాలని తెలిపారు. నారాయణపేట జిల్లా పోలీస్ వ్యవస్థ పటిష్టతపై దృష్టి సారించాలనీ, ప్రతి అధికారి తాను బాధ్యత వహిస్తున్న ప్రాంతంలో నేరాలు జరగకుండా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, CI లు శివశంకర్, రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, సైదులు ఎస్సైలు వెంకటేశ్వర్లు, రాముడు, SM నవీద్, భాగ్యలక్ష్మి రెడ్డి, అశోక్ బాబు, రాజు, విజయ్ కుమార్, బాలరాజు, రమేష్, రాము, రాజశేఖర్, రమేష్, పురుషోత్తం, నరేష్, సునీత, సురేష్, విజయ్ భాస్కర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.