: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ‘Arrive Alive’ 2వ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ మరియు పోలీస్ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా డ్రైవర్లకు కలర్ బ్లైండ్, వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం జరుగుతుంది అని అలాంటి వారికి చికిత్స ద్వారా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకొని తగిన జాగ ముఖ్యంగా డ్రైవర్లకు సమస్యలు లేకుండా కంటి చూపు సక్రమంగా ఉండటం అత్యవసరమని తెలిపారు. కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా ఆటో, టాక్సీ డ్రైవర్‌కు కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించడమే కాకుండా, తగిన చికిత్సలు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించబడతాయని ఎస్పీ వివరించారు.
డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై పలు ముఖ్య సూచనలు చేశారు. వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రహదారి సూచనలను పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, కారులో సీట్ బెల్ట్ మరియు ద్విచక్ర వాహనంపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించరాదని, అలసట లేదా నిద్రలేమి ఉన్నప్పుడు వాహనం నడపవద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన లైసెన్స్, ఇన్సూరెన్స్, ప్యూసీ, రిజిస్ట్రేషన్ వంటి పత్రాలు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని, బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న జాగ్రత్త ప్రాణాలను కాపాడగలదని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ శిబిరం ద్వారా మొత్తం 70 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ DAR ఎండి రియాజ్ హూల్ హాక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, CI శివ శంకర్, RI లు నరసింహ, విజయ్ భాస్కర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ లు సునీల్,మల్లికా, సాయి ఆదిత్య, కనిగిరి శేఖర్ టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య, RSI లు శ్వేత, శిరీష, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.