నారాయణపేట జిల్లా కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లైసెన్స్ సర్వేయర్ సిస్టం అనేది నిరుద్యోగులకు మంచి ఉపాది అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడిచిన ఐదు నెలలుగా కష్టపడి ట్రైనింగ్ తీసుకొని పాస్ అయిన అభ్యర్థుల కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము, లైసెన్స్ సర్వేయర్లుగా నియమించబడిన మా నుంచి ఒక చిన్న విన్నపం, దయచేసి మా యొక్క విన్నపాన్ని అంగీకరించగలరు.
లైసెన్స్ సర్వేయర్లకు ఫైల్ బేస్ట్ కాకుండా ప్రతినెల బేసిక్ సలారీ ఇస్తే బాగుంటుంది. ఎందుకనగా, రోజువారీ ఖర్చులు చాలా పెరిగిపోయాయి, కుటుంబాన్ని పోషించడానికి నెలా జీతం లేకపోతే చాలా కష్టం. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లాలన్నా భూమి కొలనాలన్నా వాహనంలో పెట్రోల్ పోయించుకోవాలి. గత ఐదు నెలలుగా, మాకు ఆదాయం లేదు మరియు రోజువారీ శిక్షణ కారణంగా అప్పుల్లో కూరుకుపోయాము. ఇక నుంచి జీతం లేకుండా పని చేయాల్సి వస్తే చాలా కష్టం అవుతుంది. మేము చెయ్యలేకపోతున్నాము. మేము అలా చేస్తే, మా కుటుంబాలు గడవడం చాలా కష్టం అవుతుంది. కావున తమరు దయచేసి మా అభ్యర్ధనను అంగీకరించి, మాకు కనీస నెలవారీ జీతాలను ఇవ్వగలరని మనవి.లైసెన్స్ సర్వేయర్లకు నెలవారీ వేతనం చెల్లించాలని నేడు నారాయణపేట జిల్లా కార్యాలయం
కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కు వినతి పత్రం సమర్పించారు.