ప్రధాన లక్ష్యం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు అరికట్టడం The main goal is to curb the use of intoxicants like marijuana and drugs.

The main goal is to curb the use of intoxicants like marijuana and drugs.
The main goal is to curb the use of intoxicants like marijuana and drugs.

పోలీసులకు రివార్డ్ అందించిన:జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS.

నారాయణపేట జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల సరఫరా పై గట్టి పర్యవేక్షణలో భాగంగా ఇటీవల గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను జైలుకు పంపిన మక్తల్ సర్కిల్, టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు సిబ్బంది మక్తల్ సీఐ రామ్ లాల్,SI లు, పురుషోత్తం, SM నవీద్, HC గోప్యనాయక్, PC లు రాఘవేందర్,రామస్వామి,అశోక్ కుమార్,శ్రీకాంత్,భాను లను
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారు అభినందించి రివార్డ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు జిల్లాలో పూర్తిగా అరికట్టడం మా ప్రధాన లక్ష్యం అని గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. పోలీసులు కష్టపడి బాగా పని చేస్తే రివార్డులు అవే వస్తాయి అని ఆలాగే నిబద్ధతతో పనిచేయాలని, ప్రతి పోలీసు సభ్యుడు ప్రజల రక్షణకు కట్టుబడి ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్ లు ఉన్నారు.

Leave a Comment