
విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు తెలిపారు.
రెండోవ విడత నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నాలుగు మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినా, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సమావేశాలు, బైక్ ర్యాలీలు, టపాకాయలు కాల్చుడు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.
శాంతి–భద్రతల పరిరక్షణ కోసం MCC కోడ్ పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ గారు తెలిపారు.