యువజనోత్సవాలు youth festivals

యువజనోత్సవాలు
స్వామీ వివేకానంద జయంతిని పురస్క రించుకొని యువతలోని ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా యువజనోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి ఉత్సవాలు నిర్వహిం చేందుకు జిల్లా అధికారులు సన్నద్ధ మవుతున్నారు. నారాయణ పేట పట్టణంలోని తేది. 07.11.2025 రోజున
స్థలం: S.R. Garden, old Govt. Hospital యువతకు వివిధ రకాల పోటిలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే ఈ పోటీల్లో 15 ఏళ్ల నుంచి 29 సంవత్సరాల లోపు వయసున్న వారంతా పాల్గొనవచ్చు. ఇక్కడ ప్రతిభ చాటితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం కల్పి స్తారు. ఆయా జిల్లాల యువజన, క్రీడల శాఖ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
నిర్వహించే పోటీలు ఇలా..
1. జానపద నృత్యాలు: దీనికి పది మంది
సభ్యులు తప్పనిసరిగా పాల్గొనాలి. వీరు 15 నిమిషాల పాటు జానపద నృత్య ప్రదర్శన చేయాలి. ప్రత్యక్షంగా పాడిన పాటలకు నృత్యం చేయాల్సి ఉంటుంది.
2.జానపద గేయాలు: జానపద
పాటల విభాగంలో పది మందితో కూడిన బృందం పాల్గొనాలి. ఈ బృందంలో జానపద పాటలు మాత్రమే పాడాలి. 7 నిమి షాల వ్యవధి ఉంటుంది.
3. కవితా రచన: గంట వ్యవ
ధిలో 500 పదాల్లో ఏదైనా ఒక సామాజిక అంశాన్ని కవిత్వంగా రాయాలి.
4. పెయింటింగ్:
ఒక్కో అభ్యర్థి ఒక పోస్టర్ వేయడా నికి అర్హులు. నచ్చిన ఇతివృత్తంపై ఏ3 పేపర్పై 90 నిమిషాల వ్యవధిలో ‘నషా ముక్త యువ’ లేదా హెల్దీ లైఫ్ స్టైల్ అనే అంశా లపై పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది.
5. వక్తృత్వ పోటీలు: ఎంపిక చేసిన అంశంపై
హిందీ, ఇంగ్లిషులో మూడు నిమిషాలు మించ కుండా మాట్లాడాల్సి ఉంటుంది.
శ్రీ. వెంకటేష్ శెట్టి గారు నారాయణపేట జిల్లాలోని యువకులు అందరు కుడా సద్వినియోగం చేసుకోవాలి:
యువజనోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ మంది యువత రాష్ట్ర స్థాయిలో పాల్గొనేలా చూస్తాం కోఆర్డినేటర్ల సహకారంతో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి.

నిర్వహించు తేది: 05.11.2025
స్థలం : S.R. Garden, Old Govt. Hospital, నారాయణపేట

Leave a Comment