బాల రక్ష వాహనమును నడుపుటకు గాను డ్రైవరు కొరకు దరఖాస్తుల ఆహ్వానం

Date 2025 Nov 03:నారాయణపేట జిల్లా పరిధిలో “బాల రక్ష భవనము” నకు సంబందించిన వాహనమును నడుపుటకు గాను అనుభవం గల ఆసక్తి గల డ్రైవరుల నుండి దరఖాస్తులను ఆహ్వానించనైనదనీ జిల్లా సంక్షేమ అధికారి అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను పదవ తరగతి చదివిన మరియు అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
జతచేయవలసినవి:
1. పదవ తరగతి సర్టిఫికేట్
2. డ్రైవింగ్ లైసెన్సు
3. అనుభవం సర్టిఫికేట్
4. స్థానికత సర్టిఫికేట్
5. ఆధార కార్డ్
పై తెలిపిన ప్రమాణాల ప్రకారం ఆసక్తి గల డ్రైవరులు నిర్ణీత దరఖాస్తు ఫారంలను అన్నీ డాక్యుమెంట్స్ తో కలిపి జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం, మోనప్పగుట్ట దగ్గర, నారాయణపేట నందు 07-11-2025 సాయంత్రం 5 గం. లోగా కార్యాలయ వేళలో సమర్పించవలెననీ వారు తెలిపారు

Leave a Comment