తేది 14 – 12- 2025,
నారాయణపేట జిల్లాలో రెండో విడత పోలింగ్ శాతం 84.33
మొత్తం ఓట్లు 150318
పోలైన ఓట్లు 126769
నారాయణపేట జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ 84.33 శాతం నమోదు అయింది. రెండో విడత లో దామరగిద్ద, నారాయణ పేట, ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీ ల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.
నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 1,50,318 ఓట్లు ఉండగా మొత్తం 1,26,769ఓట్లు పోల్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 72.34 శాతం పోలింగ్ నమోదు కాగా పూర్తిగా పోలింగ్ ముగిసిన తర్వాత 84.33 శాతంగా నమోదు అయింది. అయితే మొదటి విడత పోలింగ్ 84.58 గా నమోదు కాగా ఆదివారం నాటి పోలింగ్ 84.33 శాతంగా నమోదయింది. మొదటి విడత పోలింగ్ శాతం కంటే రెండో విడత లో స్వల్పంగా ( కొంచెమే) తగ్గింది. ఆదివారం జరిగిన రెండో విడత పోలింగ్ లో నాలుగు మండలాల్లో మొత్తం 76,642 మంది మహిళా ఓటర్లకు గాను 64,065మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తం 73 ,674మంది పురుష ఓటర్లకు గాను 62,703 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా నాలుగు మండలాలలో అత్యధికంగా దామరగిద్ద మండలంలో 85.21 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ధన్వాడ మండలంలో 82.14 శాతం పోలింగ్ నమోదు అయింది.
*మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయిన పోలింగ్ శాతం..*
దామరగిద్ద మండలంలో మొత్తం ఓటర్లు 39,812 మంది ఓటర్లు ఉండగా, 33925 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో మొత్తం 85.12 శాతం పోలింగ్ నమోదు అయింది.
ధన్వాడ మండలంలో మొత్తం ఓటర్లు 30019 మంది ఉండగా, 24,659 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో 82.14 శాతం పోలింగ్ నమోదు అయింది. మరికల్ మండలంలో మొత్తం 33, 444 మంది ఓటర్లు ఉండగా, 28,381మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో 84. 86శాతం పోలింగ్ నమోదు అయింది.
ఇక చివరగా నారాయణ పేట మండలంలో మొత్తం ఓటర్లు 47043 మంది ఉండగా వారిలో 39,804మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం నాలుగు మండలాలు కలిపి 84.33 శాతం పోలింగ్ నమోదు అయింది..