మరికల్ SHO గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై M. విక్రమ్
నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ M. విక్రమ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మరికల్ ఎస్సైగా విధులు నిర్వహించిన రాములు నగర్ కర్నూలు జిల్లా తడూరు పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సై విక్రమ్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారిని ఎస్పీ కార్యాలయంలో పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ గారు నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలియజేసి మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్నేహపూర్వక పోలీసింగ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలైనా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలియజేయాలని సూచించారు.
గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగం, పేకాట, గంజాయి రవాణా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, యువత చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ తెలిపారు.