
కుమ్మెర జాతరలో పసికందు హంతకులను కఠినంగా శిక్షించాలి .
బాధితులకు అండగా ఉండాలి .
సిపిఎం డిమాండ్
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో కుల వివక్షకు పాల్పడి ,పాప హత్యకు కారణమైన నిందితులపై హత్య కేసు నమోదు చేయాలి, కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు లు తీరుకు నిరసనగా ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు .
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగిన సంఘటన అగ్రకుల పెతందారులు తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు అణగారిన వర్గాలపై అణిచివేతల కుల వివక్షతలకు పాల్పడుతున్న ప్రభుత్వం కఠినంగా శిక్షించకపోవడం దారుణం అని విమర్శించారు.
గుడిలో దేవుని మొక్కెంధుకు టికెట్ తీసుకోలేదని నెపముతో చంద్రకళను ఆమె భర్తను తీవ్రంగా కొట్టి పసికందును కాళ్లతో తన్నడం వలన పాప ప్రాణాలు కోల్పోయిందని అమాన వీయమైన ఈ సంఘటనలో పోలీసులు బాధితుల తరఫున ఉండకుండా అగ్రకుల పెత్తందారుల తరఫున కేసును నమోదు చేయడం దారుణమని విమర్శించారు .
ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీని అణగారిన వర్గాలకు పోలీస్ స్టేషన్లో,గుడిలో న్యాయం జరగకపోవడం మనల్ని పాలించె పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు .
బాధితుల తరఫున బలహీన వర్గాల తరఫున ఉండాల్సిన పోలీసులు నిందితుల తరఫున నిలబడడం దారుణమని విమర్శించారు .
బాధితులకు అండగా ఉండాలని నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని. సి.ఐ. ఎస్.ఐ ఇద్దరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండమీది బల్ రామ్ సిపిఎం జిల్లా నాయకులు కే కాశప్ప, నరహరి,యాదప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాను పవన్ తదితరులు పాల్గొన్నారు