80 percent mapping should be completed within a week

వారం రోజుల్లో 80 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలి

80 percent mapping should be completed within a week

నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

 

నారాయణ పేట జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్ళి ఖచ్చితమైన ఓటరు గుర్తింపుతో ప్రోసిడింగ్ మ్యాపింగ్, ఎలక్ట్ర రోల్ మ్యాపింగ్ చేపట్టాలని వారం రోజుల్లో ఈ ప్రక్రియను 80 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఎస్ ఐ ఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదును అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారని ఆమె తెలిపారు. ఎస్ ఐ ఆర్ ప్రారంభమైతే నేరుగా డిల్లీ నుంచి బృందం వచ్చి తనిఖీ చేస్తుందని, అప్పుడు ఏమైనా పొరపాటు ఉందని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అందుకే బి ఎల్ వో లు సమయం తీసుకుని ఇల్లిల్లు తిరిగి మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మంగళ వారం సాయంత్రం జిల్లాలోని దామరగిద్ద, ధన్వాడ, మరికల్,మక్తల్, మాగనూరు, కృష్ణ,ఉట్కూర్, నర్వ, నారాయణ పేట మండలాల తహసీల్దార్లు, ఏఈఆర్ వోలతో ఎస్ ఐ ఆర్ పై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తో కలిసి కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ఈ ఆర్ వో లు, బి ఎల్ వో లు, సూపర్ వైజర్లు ఇప్పుడే క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదని తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాక ఒత్తిడి పడకుండా ఇప్పుడే ఎవరి పరిధిలో వారు పని చేసుకుంటే ఎస్ ఐ ఆర్ చేసే సమయంలో పని చాలా సులువు అవుతుందన్నారు. అయితే తహాసిల్దారులు విధిగా పర్యవేక్షణ చేయాలని, ప్రస్తుతం తహసిల్దార్ కార్యాలయాల్లోనే మ్యాపింగ్ పని కొనసాగుతోందని తర్వాత విస్తరించే అవకాశం ఉందన్నారు. బిఎల్ఓ లకు ఆదేశాలిచ్చి ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయించాలన్నారు. మ్యాపింగ్ సమయంలో పొరపాటు జరగకుండా ఓటరు నిజమేనని నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాలు కూడా సేకరించాలని, లేదంటే తీసే ఆస్కారం ఉందని, ఆ తర్వాత మళ్ళీ వాళ్లు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందనే విషయాన్ని మరచి పోవద్దు అని ఆమె తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియ లో సిద్ధి పేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలలో 80 శాతం పూర్తి అయిందని, వారం రోజుల్లో మన జిల్లా కూడా 80 శాతం చేరుకోవాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఈ సమీక్షలో ఆర్డిఓ రామచంద్రనాయక్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారినిలు జయసుధ, రాణి దేవి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Leave a Comment