
నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చ్ 28న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ఉద్దేశించి పోలీస్ ఆఫీసర్స్ తో సీనియర్ సివిల్ జడ్జి మరియు లీగల్ సర్వీసెస్ కార్యదర్శి శ్రీమతి వింధ్య నాయక్ గారు మాట్లాడుతూ..రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని న్యాయమూర్తి తెలిపారు. నారాయణపేట జిల్లాలోని మొత్తం 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. వాటిని ఈ లోక్ అదాలత్ లో త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు నారాయణపేట టౌన్ మరియు రూలర్, మాగనూరు, మద్దూరు, దామరగిద్ద, ఉట్కూర్, కోస్గి, ధన్వాడ, మక్తల్, కృష్ణ, నర్వ, మరియు మరికల్, ఎక్సైజ్ ఇతర స్టేషన్ లలో ఈపెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెండింగ్లో ఉన్నాయని టార్గెట్ గా ఉన్నాయని తెలిపారు. ఎక్సయిజ్ శాఖలో పెండింగ్ కేసులు ఉన్నాయా క్లియర్ చేయాలన్నారు. అన్ని కలిపి 6000 కేసులను ఇచ్చిన టార్గెట్ ను కేసులని డిస్పోజల్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు, త్వరగా పెండింగ్లో ఉన్న కేసులని ఈ లోక్ అదాలత్ చర్యలు తీసుకొని కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని టీములు సిద్ధంగా ఉండాలని ఈ లోక్ అదాలత్ ను కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏజెండా లోని అంశాలను క్రిమినల్ కాంపౌండ్డబుల్ కేసులు సివిల్ కేసులు, సైబర్ క్రైమ్స్, కేసులను, NI ఆక్ట్ పెండింగ్ లో ఉన్నాయా చర్చించారు పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క కేసు ఈ లోక దాతలు డిస్పోసల్ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. తదుపరి లీగల్ సర్వీసెస్ సంస్థ నుంచి మంత్లీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిపించి న్యాయమూర్తి గారు మాట్లాడుతూ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ కే లక్ష్మీపతి గౌడ్ మరియు పార లీగల్ వాలంటీర్స్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాల్లో లోక్ అదాలత్ యొక్క ఉచిత సేవలు, ఉచిత న్యాయం , టోల్ ఫ్రీ 15100 గురించి అవేర్నెస్ చేయాలని లీగల్ సర్వీసెస్ కార్యదర్శి శ్రీ విద్యా నాయక్ గారు ఆదేశించారు.
ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే అవినాష్, సెకండ్ క్లాస్ కోర్ట్ న్యాయమూర్తి, డిఫెన్స్ కౌన్సిల్స్ కె లక్ష్మి పతి గౌడ్, మరియు పోలీస్ అధికారులు, కోర్ట్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.