బ్యాంకులో నగదు డ్రా చేసిన తర్వాత డబ్బును బహిరంగంగా

బ్యాంకుల వద్ద జాగ్రత్తలు పాటించాలి: మరికల్ సీఐ భగవంత్ రెడ్డి.

బ్యాంకులకు వచ్చే ప్రజలు, బ్యాంకు అధికారులు, సిబ్బంది భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని మరికల్ సీఐ భగవంత్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా  మరికల్ సీఐ భగవంత్ రెడ్డి, ఎస్ఐ రాములు మరికల్ పట్టణంలోని బ్యాంకులను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా బ్యాంకుల పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూడాలని తెలిపారు. బ్యాంకులకు నగదు లావాదేవీల కోసం వచ్చే ఖాతాదారులు అపరిచితుల మాటలు నమ్మవద్దని, డబ్బు లెక్కించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ భగవంత్ రెడ్డి మాట్లాడుతూ… బ్యాంకుల వద్ద నిత్యం రద్దీ ఎక్కువగా ఉండటంతో దొంగతనాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకులో నగదు డ్రా చేసిన తర్వాత డబ్బును బహిరంగంగా చూపించకుండా జాగ్రత్తగా తీసుకెళ్లాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు సహాయం పేరుతో దగ్గరకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అలాగే ఏటీఎం కేంద్రాల వద్ద రాత్రి సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఏటీఎం పిన్ నంబర్‌ను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. బ్యాంకు సిబ్బంది కూడా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రతి లావాదేవీపై నిఘా ఉంచాలని సూచించారు. నారాయణపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

Leave a Comment