
అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు: జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ IPS.
నారాయణపేట జిల్లా పోలీస్ ప్రత్యేక చర్యలో భాగంగా, గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి, 12.4 కిలోల గంజాయి, రూ.10,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 2 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు పత్రిక సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.
కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో తేది:02-11-2025న మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో కృష్ణ మండలంలోని కున్సి గ్రామ శివారులో ఎస్ఐ SM నవీద్, కృష్ణ పోలీసులు వాహనల తనిఖీల చేస్తుండగా ఈ తనిఖీల్లో రెండు బైకులపై ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించగా, వారి వద్ద సంచిలో గంజాయిని అక్రమంగా నారాయణపేట జిల్లాకు రవాణా చేస్తున్నట్లు తెలిసిందని అట్టి వారిని విచారంగా కొంత సమాచారం మేరకు వెంటనే పోలీసు బృందం కృష్ణ రైల్వే స్టేషన్ వద్ద మరో ఐదుగురు వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని అట్టి విచారణలో నిందితులు మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ మరియు కర్ణాటక రాష్ట్రంలోని యాదగిర్ జిల్లాల నుండి గంజాయిని రవాణా చేసి తెలంగాణ రాష్ట్రంలో చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు అంగీకరించారు.
తదుపరి విచారణలో, నిందితులంతా గత రెండు సంవత్సరాలుగా అంతర్ రాష్ట్ర ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలిందనీ నిందితుల్లో ఒకరైన సుఫియాన్ షాకు నారాయణపేటలో గతంలో నమోదైన కేసులో ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని అట్టి నిందితులను విచారించగా వారి వద్ద నుండి
12.4 కిలోల గంజాయి, 2 మోటార్‌సైకిళ్లు, 10,000 వేల రూపాయల నగదు,10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని
అట్టి నిందితులందరినీ న్యాయస్థానం ముందు హాజరుచేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు.
నిందితుల వివరాలు:
1. సయ్యద్ అజార్ అలీ – నారాయణపేట
2. మొహమ్మద్ సుఫియాన్ షా – నారాయణపేట
3. కనిగిరి విశాల్ – నారాయణపేట
4. ఉమేష్ – యాదగిర్, కర్ణాటక.
5. సోనియా. యాదగిరి, కర్ణాటక.
6. లల్లన్ – యాదగిర్, కర్ణాటక
7. సమీర్ సయ్యద్ – యాదగిర్, కర్ణాటక
8. తుకారాం – సోలాపూర్, మహారాష్ట్ర
9. సమీర్ – సోలాపూర్, మహారాష్ట్ర
10. అక్షయ్ – సోలాపూర్, మహారాష్ట్ర.
“గంజాయి స్మగ్లింగ్, రవాణా, విక్రయం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ఎవరైనా పాల్గొన్న అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాంమని ఎస్పీ గారు హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై జీరో టాలరేన్స్ విధానాన్ని అమలు చేస్తుందని గంజాయి సాగు, రవాణా, విక్రయంవంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. యువత భవిష్యత్తు చెడగొట్టే మాదకద్రవ్యాల నుండి సమాజాన్ని రక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యతని ప్రజలు కూడా ఇలాంటి చర్యలను గమనిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ గారు తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు:
డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో మక్తల్ సిఐ రామ్ లాల్, కృష్ణ SI SM నవీద్, టాస్క్ ఫోర్స్ SI పురుషోత్తం, టాస్క్ ఫోర్స్ పోలీసులు HC గోప్య నాయక్ , టి. రాఘవేంద్ర గౌడ్, ఎం. రామస్వామి, ఎన్. అశోక్ కుమార్, శ్రీకాంత్ లను ఎస్పీ గారు అభినందించి త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.