నారాయణపేట పట్టణం ,సర్కిల్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఉదయం 11 గం కు విద్యుత్ వినియో గదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్.ఈ. వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ పరమైన సమస్యలు విద్యుత్ అధికారుల దృష్టికి వ్రాత పూర్వకంగా ఇవ్వగలరని కోరడమైనది. వ్యసాయ రంగానికి సంబం ధించిన సమస్యలు, వ్యవసాయ పంపు సెట్లు నాణ్యమైనవి ఐ.ఎస్.ఐ. మార్క్ కలిగిన వస్తువు లను కోనుగోలు చేయ్యాలని అధికారులు సూచించారు.ఈ సమయంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. నారాయణపేట తోపాటు మక్తల్, కోస్గి సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్.ఈ. వెంకటరమణ పత్రికా ప్రకటన లో పేర్కొన్నారు.
