
నారాయణపేట జిల్లాలో కూడా టిప్పర్లు ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నాయి! వాటిని సంబంధిత అధికారులు కంట్రోల్ చేయాలి లేనట్లయితే రద్దు చేయాలి!! ప్రమాదాలు నివారించాలి!!!
కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్.
మొన్న రంగారెడ్డి జిల్లాలో నిన్న వికారాబాద్ జిల్లాలో నేడు గోవా హైవే పైన ప్రయాణిస్తున్న ఓవర్ లోడ్ టిప్పర్లు విపరీతంగా అతివేగంగా ప్రయాణించడం వల్లనే వేలాది విలువైన ప్రాణాలను ప్రమాదాల పాలు చేసి తీసేసిన సంఘటనలు నారాయణపేట జిల్లాలో జరగకముందే జిల్లా రవాణా శాఖ అధికారులు మరియు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి నివారించాలని డిమాండ్ చేస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల్లో టిప్పర్ల వల్ల వాటి అతివేగం వల్ల మరణ మృదంగం మారిమోగుతుండగా వేలాది విలువైన ప్రాణాలు ప్రమాదాలకు గురై గాలిలో కలిసిపోయినాయి అనేకమంది క్షతగ్రతలు ఆయా దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉండగా నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా ట్రాక్టర్ల బదులు పెప్పర్లు తమ తమ రవాణాకు వాడుతుండడం వల్ల ఇసుక టిప్పర్ల వల్ల గాని కంకరణ టిప్పర్ల గాని ఓవర్ లోడ్ ను సంబంధిత అధికారులు పరిశీలించకపోవడం వల్ల పట్టణ పరిసరాల్లో లోన అతివేగంగా టిప్పర్లు ప్రయాణం స్తుండడం వల్ల నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఒక స్కూటీ లిస్టు మృతిచెందగా సుభాష్ రోడ్ లో మరో టూవీలర్ మృతిచెందగా దాదాపు జిల్లా కేంద్రంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలామంది చనిపోయిన సంఘటనలు అధికారుల దృష్టిలో ఉండనే ఉన్నాయి. ఇనపటికి ఇటు రవాణా శాఖ అధికారులు గానీ, అటు పోలీసు ఉన్నతాధికారులు గాని సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల అవి బాద చారలను రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర మరియు గారు ఓనర్లను భయపెడుతున్నాయి. ప్రమాదాల జరిగి ప్రాణాలు పోయిన తర్వాత పోస్టుమార్టం చేసే బదులు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో కలిసి తీసుకుంటే తప్ప వీటికి శాశ్వత పరిష్కారం ఉండబోదు.
జిల్లా వ్యాప్తంగా టిప్పర్ల వాడకం విపరీతంగా పెరగడం వల్ల వాటి డ్రైవర్లు తిప్పర్లు ఎక్కడంతోనే గాలిలో తేలిపోతుండం వల్ల అతివేగంగా నడుపుతుండడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రమాదాలు జిల్లాలో రావడం ఎంతో దూరంలో దూరంలో లేదని తెలియజేస్తున్నది.
కాబట్టి టిప్పర్లు కంట్రోజయం చేయడం కానీ చేయలేకపోతే రద్దు చేయడం గాని చేయాల్సిందిగా నారాయణపేట జిల్లా కేంద్ర మరియు జిల్లా ప్రజల తరఫున సంబంధిత అధికారులకు డిమాండ్ చేస్తున్నాం.