భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) ఆధ్వర్యంలో MPDO గారికి వినతిపత్రం సమర్పణ.
నారాయణపేట జిల్లా దామరగిద్ద GPS పాఠశాలలో వంట గది నిర్మాణం అసంపూర్తిగా నిర్మించారు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన వంటగది నిర్మాణం పనులు పెండింగ్లో ఉందో,వర్షంలో వంట చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ వర్షంలో వంట చేస్తున్నారు,ఈ వర్షం వలన విద్యార్థులకు భోజనం సమయానికి వండించడం లేదు,అలాగే విద్యార్థులు వర్షంలో తడుస్తూ భోజనం చేస్తున్నారు,కావున వంటగది నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని ఎంపీడీవో సాయి లక్ష్మి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మోహన్,సిఐటియు మండల కార్యదర్శి జోషి,ఎస్ఎఫ్ఐ మండల నాయకులు మహేష్ కుమార్ యాదవ్,అరవింద్ పాల్గొన్నారు.
