
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముకుల గ్రామంలో కడప రాయుడు దేవాలయం సమీపంలో శివాలయం నిర్మాణానికి గ్రామ ప్రజలు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా శివాలయం నిర్మాణానికి సహకారం అందించాలని కోరుతూ గ్రామ పెద్దలు, యువకులు కలిసి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ నిర్మాణం గ్రామ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ ప్రజల వినతిని ఆలకించిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి గారు ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు యువకులు పాల్గొన్నారు. గ్రామంలో శివాలయం నిర్మాణం జరిగితే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడటంతో పాటు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.