నారాయణపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్” లో భాగంగా నారాయణపేట జిల్లా గాయత్రి ఫంక్షన్ హాల్, నారాయణపేటలో జిల్లా సంక్షేమ శాఖ మరియు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాకు చెందిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, విశిష్ట అతిథిగా తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ శ్రీ ముత్తినేని వీరయ్య గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సి.హెచ్. ప్రియాంక గారు, అదనపు కలెక్టర్ శ్రీ ఎస్. శ్రీను గారు, మక్తల్, నారాయణపేట, మద్దూర్, కోస్గి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు మరియు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అతిథులు ప్రశంసించారు. ప్రత్యేకంగా దివ్యాంగుల స్వయం ఆధారిత జీవనానికి దోహదపడే విధంగా రిట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు (34), బ్యాటరీ వీల్ చైర్ ట్రైసైకిల్ – 10, టలాప్టాప్ (08) , చెవి వినికిడి యంత్రాలు (2 )లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గౌరవ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు దివ్యాంగుల జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్దన్నలా, ఆత్మీయ బంధువులా అండగా నిలుస్తున్నారని తెలిపారు. అలాగే తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ శ్రీ ముత్తినేని వీరయ్య గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే కల్యాణ లక్ష్మి పథకంతో పాటు అదనంగా రూ.2 లక్షల వివాహ ప్రోత్సాహక బహుమతి అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఐదు సంవత్సరాల లోపు దివ్యాంగ చిన్నారులకు శస్త్ర చికిత్సలు నిర్వహించి సాధారణ జీవితం గడిపేలా చేయడం కోసం “బాల భరోసా” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయ ఉపకరణాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి సి.హెచ్. ప్రియాంక గారు మాట్లాడుతూ దివ్యాంగ మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందించబడతాయని తెలిపారు. దివ్యాంగ మహిళలు తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలో చేరాలని కోరారు. నారాయణపేట జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీ ఎల్. రాజేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ దివ్యాంగులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన ప్రతి దివ్యాంగునికి సహాయ పరికరాలు అందజేస్తామని, ఇప్పటివరకు పొందని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో Dist అడిషనల్ కలెక్టర్ శ్రీ S. శ్రీను గారు,RDO ఎల్. రమేష్ గారు, డీపీవో సుధాకర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు మరియు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ సాయి, లబ్ధిదారులు, దివ్యాంగులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.