శివాజీవిగ్రహప్రతిష్టాపనకుఐక్యంగా కృషిచేద్దాం. Let us work together for the installation of the Shivaji statue.

శివాజీవిగ్రహప్రతిష్టాపనకుఐక్యంగా కృషిచేద్దాం.

సమావేశమైన జాజాపూర్ హిందూ సమాజ్ సభ్యులు
సమావేశమైన జాజాపూర్ హిందూ సమాజ్ సభ్యులు

శివాజీ సామ్రాట్ విగ్రహ ప్రతిష్టాపనకు ఐక్యంగా కృషి చేద్దామని జాజాపూర్ హిందూ సమాజ్ సభ్యులు, విగ్రహ కమిటీ సభ్యులు అన్నారు. మంగళవారం నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ లో సామ్రాట్ శివాజీ విగ్రహ కమిటీ సమావేశం శ్రీ అంబా భవాని మాత దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామ్రాట్ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని జాజాపూర్ గ్రామంలో స్థాపించాలని హిందూ సమాజ్ సభ్యులు ఏకతాటిపై నిర్ణయాన్ని తీసుకున్నమని అన్నారు. విగ్రహ స్థాపన మా లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.అనంతరం సామ్రాట్ శివాజీ విగ్రహ స్థాపన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అధ్యక్షులుగా ఆలుగడ్డ రవి ఉపాధ్యక్షులుగా మల్లేష్ కార్యదర్శులుగా క్యాతంపల్లి రవి మండికి ఆనంద్ కోశాధికారులుగా కుమ్మరి వెంకటేష్ చంద్రమోహన్ లతోపాటు కార్యవర్గ సభ్యులుగా కుమ్మరి లక్ష్మణ్ ఈడికి నవీన్ సిరిగిరి శ్రీధర్ కోళ్ల విజయ్ కురువ మల్లేష్ అశోక్ కూర శివ క్యాతంపల్లి ఆనంద్ అనిల్ కన్నా అరిగే అనిల్ మన్నె మల్లేష్ లను ఎన్నుకొన్నారు ఈ కార్యక్రమంలో జాజాపూర్ హిందూ సమాజ సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment