
సేవాలాల్ బంజారా భవన్ పునఃప్రారంభానికి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడికి వినతిపత్రం
నారాయణపేట జిల్లా కేంద్రంలో రద్దైన సంత్ సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణాన్ని వెంటనే పునఃప్రారంభించాలని కోరుతూ నారాయణపేట ఎమ్మెల్యే శ్రీమతి చిట్టెం పర్ణిక రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు మాధవ్ రెడ్డి గారికి గిరిజన నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా సేవాలాల్ బంజారా భవన్‌ను బంజారా బిడ్డలకు కానుకగా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్, నారాయణపేట జిల్లా ఎస్సి ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు కిష్ట్యా నాయక్, బోయినపల్లి తాండ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఊటకుంట తాండ సర్పంచ్ వెంకట్ నాయక్, రమేష్ నాయక్, గోవింద్ నాయక్, సూర్య నాయక్ తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు.