Capitalist society must be transformed.

Capitalist society must be transformed.
Capitalist society must be transformed.

నేడు కొనసాగుతున్న పెట్టుబడి దారి సమాజాన్ని మార్చాలని సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని సిపిఐ( ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు ఎస్ఎల్ పద్మ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణ పేట భగత్ సింగ్ భవన్లో జరిగిన మాస్ లైన్ పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై ‘ “మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్రం'” అనే అంశాన్ని బోధించారు. ఈ క్లాసులో భాగంగా నేడు బోధిస్తు, కొనసాగుతున్నటువంటి ఆర్థిక శాస్త్ర సూత్రాలు పెట్టుబడిదారి సమాజం కోసం పనిచేస్తున్నాయనీ, అలా కాకుండా శ్రామిక వర్గం , మనుషులంతా సమానంగా ఉండే వ్యవస్థ కోసం పనిచేసే మార్క్సిస్టు అర్థశాస్త్రాన్ని తీసుకురావాలని అందుకోసం ప్రతి వ్యక్తి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు నేడు ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే భూమి, నీరు, గాలి ఇలాంటి అన్నింటిపై పట్టు సాధించి వాటిని సర్కుగా మార్చి స్వలాభం కోసం అమ్ముతున్నారు. ఇదే సరిఅయిన పద్దతని చెపుతా, కార్మికుల శ్రమను దోచి కుబేరులుగా ఎదుగుతున్నారు. కానీ ఇరవై నాలుగు గంటలు శ్రమ చేసే కార్మికులకు అరకొర వేతనాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. శ్రమని దోచుకోవడమే హక్కు భావిస్తు ప్రశ్నించిన వారిపై నిర్భంధం విడిస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పని శ్రామికుల శ్రమపై పెట్టుబడిదారులు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతున్నారని అన్నారు. వారి సంపాదనంత కార్మికుల శ్రమినని దానిని మనం మర్చిపోరాదని అన్నారు. కావున మనం ఆ సంపదను ఆక్రమించుకోవడానికి ప్రజలను నిరంతరం చైతన్యవంతం చేస్తూ పెద్ద పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఇచ్చారు.
*ప్రారంభోపన్యాసం* ఈ క్లాసులను పార్టీ సీనియర్ నాయకులు టి పి టి ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ ప్రారంభిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలనీ, నేడు మతాన్ని దేవుడిని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన బిజెపి అదే దేవుడి హుండిని కొళ్లగొడుతున్నది. దేశ సంపదను, ఆర్థిక వనరులను ప్రభుత్వ సంస్థలను ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడుదారులకు కట్టబెడుతూ, ప్రజలకు నిత్యాసర సరుకులు, పరితమైన ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నది దీనిని మనం అర్థం చేసుకొని నిత్యం ప్రజలను చైతన్యవంతం చేస్తూ సమ సమాజం కోసం పోరాడాలన్నారు.
ఈ క్లాసులలో మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యం. కృష్ణ, నారాయణ పేట్ జిల్లా కార్యదర్శి బి.రాము, జిల్లా నాయకులు సలీం , కె.కాశీనాథ్, బోయిన్ పల్లి రాము, యాదగిరి , రామకృష్ణ, బి. నర్సింహా, కొండా నరసింహులు, చెన్నారెడ్డి , భగవంతు తదితరులు పాల్గొన్నారు. క్లాసులకు ముందు పార్టీ జండాను పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి బి రాము ఆవిష్కరణ చేశారు.

Leave a Comment