18 జూలై మరియు 21 నవంబర్ 2026 నా (నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ (NI Act కేసులకు) శాశ్వత పరిష్కారం
.
నారాయణపేట జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో తేదీ 14.07.2026 నారాయణపేట జిల్లా గౌరవ ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు గారు ఆదేశాలనుసారం లీగల్ సర్వీసెస్ సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వింధ్య నాయక్ గారు సీనియర్ మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిస్ మరియు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు మరియు బ్యాంకు ఆఫీసర్స్ తో మాట్లాడుతూ.. గౌరవ జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థ ఆదేశాల మేరకు, ప్రత్యేక లోక్ అదాలత్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 కింద కేసుల కోసం ప్రత్యేకంగా ఒక లోక్ అదాలత్ను నిర్వహిస్తోంది (NI ACT Cases ) సమావేశాలు ఈ తేదీల్లో జరుగును 18 జూలై 2026 (జూలై 3వ శనివారం) మరియు 21 నవంబర్ 2026 (నవంబర్ 3వ శనివారం) అని అన్నారు.
ప్రత్యేక లోక్ అదాలత్ ను అనగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం చెక్కు బౌన్స్ కేసుల (N.I., చట్టం కేసులు) పరిష్కారం కోసం సంబంధించి జిల్లా కోర్టు మరియు అన్ని జ్యూడిషల్ మేజిస్ట్రేట్ అఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్స్ నారాయణపేట, మక్తల్ మరియు కోస్గి ఆవరణలలో నిర్వహిస్తున్నాము అని న్యాయమూర్తి గారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ న్యాయమూర్తి జిల్లాలోని అన్ని స్టేక్ హోల్డర్లు అంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థల బ్రాంచ్ మేనేజర్లు ఇతర వాటాదారులతో మాట్లాడుతూ చెక్కులు బౌన్స్, ప్రామిసరీ నోట్లు, బిల్లుల వంటి ఆర్థిక పత్రాల పరిష్కారానికి సంబంధించి ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొనేలా పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక సంస్థల బ్రాంచ్ మేనేజర్లు ఆదేశించారు. పట్టణంలోని ప్రముఖ ప్రదేశాలలో హోర్డింగ్లు మరియు బ్యానర్లను అతికించడం, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, దూరదర్శన్ మొదలైన వాటి ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాము అన్నారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లో రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి, రాజీ కుదుర్చుకుని, కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలిపారు. రాజీపడదగు కక్షిదారులు తమ – న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలిపారు.ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ను విజయవంతం చేయుటకు గాను వివిధ తేదీలలో న్యాయమూర్తులతో, పోలీసు అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతోనూ, న్యాయవాదుల తోనూ, బ్యాంకు, చిట్ ఫండ్ మేనేజర్లతో, కోర్టు కానిస్టేబుల్స్ తో వేరు వేరు సమావేశాలు ఏర్పాటు చేసి, అధిక కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్రిక్ మీడియా సహకరించి, కక్షిదారులకు లోక్ అదాలత్ వలన కలిగే మేలును మీ వంతుగా, మీ శైలిలో తెలపాలని ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వింధ్య నాయక్ గారు కోరారు. రాజీ పడదగు కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోనెల విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రాజీపడదగు 152 పెండింగ్ ఉన్న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం చెక్కు బౌన్స్ కేసులను గుర్తించి (N.I., చట్టం) కేసులను పరిష్కరించుటకు తగినన్ని ఏర్పాటు చేసి, కక్షిదారుల సమయం వృధా కాకుండా, ఎటువంటి నిరుత్సాహానికి గురికాకుండా, వీలైనంత త్వరలో కేసు పరిష్కరించబడేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతం చేయడంలో ప్రతీ ఒక్కరు తమవంతుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి సలహాలకైనా, సందేహాలకైనా, ఏదేని న్యాయ సహాయం కోసమైనా న్యాయసేవాధికార సంస్థ ను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందాలని తెలిపారు. లోక్ అదాలత్ పట్ల మరింత సమాచారం కోసం 15100 నంబర్ కు కాల్ చేసి, సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వింధ్య నాయక్, సీనియర్ సివిల్ జడ్జి మనోజ్ మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అవినాష్ గారు మరియు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు మరియు బ్యాంకు ఆఫీసర్స్ పాల్గొన్నారు.