తేది:14-07-2026,
నారాయణ పేట జిల్లా,
*వత్తు గుండ్ల పాఠశాల వంట ఏజెన్సీని రద్దు చేసిన కలెక్టర్

—- ఆ దామర గిద్ద మండలం వత్తు గుండ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీని జిల్లా కలెక్టర్ ప్రియాంక రద్దు ( సస్పెషన్) చేశారు. మంగళ వారం వత్తు గుండ్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీకి వెళ్లిన కలెక్టర్ అక్కడ విద్యార్థులు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు చేస్తున్న భోజనంలో అన్నంతో పాటు నీళ్ళ చారు ఉండటం గమనించిన కలెక్టర్ ఆ పాఠశాల ఉపాధ్యాయుడు, వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం మెనూ లో వెజిటబుల్ కర్రీ, సాంబార్ ఉందని, కానీ విద్యార్థులకు కేవలం ( నీళ్ల శాతమే ఎక్కువగా ఉన్న) చారు ను వడ్డించడం ఏమిటని వంట ఏజెన్సీ నిర్వాహకులను నిలదీశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించకుండా, భోజనాన్ని రుచి చూడకుండా సంబంధిత ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని, విద్యార్థులకు ఎలా వడ్డింప చేశారని ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ ఆ పాఠశాల వంట ఏజెన్సీ ని (సస్పెన్షన్) రద్దు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెచ్ ఎం కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీ ఈ ఓ గోవింద రాజులు ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఆ గ్రామంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ పత్రాలు పూరించే ప్రక్రియను పరిశీలించి, నాలుగు రోజులలో గ్రామంలోని ఓటర్ల అందరితో ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకుని డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సాయిబాబా, తహసిల్దార్ తిరుపతయ్య, బీ ఎల్ వో, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.పాఠశాల హెచ్ ఎం కు షోకాజ్ నోటీసు జారీ.
దామర గిద్ద మండలం వత్తు గుండ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీని జిల్లా కలెక్టర్ ప్రియాంక రద్దు ( సస్పెషన్) చేశారు. మంగళ వారం వత్తు గుండ్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీకి వెళ్లిన కలెక్టర్ అక్కడ విద్యార్థులు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు చేస్తున్న భోజనంలో అన్నంతో పాటు నీళ్ళ చారు ఉండటం గమనించిన కలెక్టర్ ఆ పాఠశాల ఉపాధ్యాయుడు, వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం మెనూ లో వెజిటబుల్ కర్రీ, సాంబార్ ఉందని, కానీ విద్యార్థులకు కేవలం ( నీళ్ల శాతమే ఎక్కువగా ఉన్న) చారు ను వడ్డించడం ఏమిటని వంట ఏజెన్సీ నిర్వాహకులను నిలదీశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించకుండా, భోజనాన్ని రుచి చూడకుండా సంబంధిత ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని, విద్యార్థులకు ఎలా వడ్డింప చేశారని ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ ఆ పాఠశాల వంట ఏజెన్సీ ని (సస్పెన్షన్) రద్దు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెచ్ ఎం కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీ ఈ ఓ గోవింద రాజులు ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఆ గ్రామంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ పత్రాలు పూరించే ప్రక్రియను పరిశీలించి, నాలుగు రోజులలో గ్రామంలోని ఓటర్ల అందరితో ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకుని డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సాయిబాబా, తహసిల్దార్ తిరుపతయ్య, బీ ఎల్ వో, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.