నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ మండలం శేరి వెంకటపూర్ గ్రామంలో ఎస్ ఐ ఆర్ ఫామ్స్ ను ఫిలాప్ చేసి అధికారులకు అందించిన గౌరవ మాజీ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి గారు వారి సతీమణి స్వాతి రెడ్డి.అదేవిధంగా కోయిలకొండ మండలంలో ఎస్.ఐ.ఆర్ ప్రోగ్రాం గురించి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులను ఎస్ ఆర్ రెడ్డి సర్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, ఎన్యూమరేషన్ (Enumeration) దరఖాస్తు ప్రక్రియల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని BLO లకు తెలిపారు.

నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు 75% శాతం కంప్లీట్ కావడం జరిగింది. ప్రతి గ్రామంలో 100% పూర్తి చేసే విధంగా చూడాలని ఎస్ రాజేందర్ రెడ్డి బి.ఆర్.ఎస్ పార్టీ మండల నాయకులకు,కార్యకర్తలకు చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment