
◆ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందించాలి .
◆ భూనిర్వాసితుల ధర్నా
◆ భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందివ్వాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు .
బుధవారం రోజు ఆ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వం భూ సేకరణ ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నప్పటికిని చాలామంది రైతులకు పరిహారం అందివ్వలేదని, ఊట్కూర్ , పేరపల్ల రిజర్వాయర్ లలో భూములు కోల్పుతున్న రైతులకు నేటికీ ఒక పైసా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వం కోల్పోయి ఎత్తిపోతల పథకానికి తమ భూములనందిస్తున్న రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని మండిపడ్డారు .
భూ నిర్వాసితుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ధర్మరాజు గౌడ్ గోపాల్ రెడ్డి ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉద్మల్ గిద్ద గోపాల్ మాట్లాడారు .
పొలాల్లో ఉన్న బోరు బావులు, పైప్ లైన్లు, చెట్లు తదితర వాటికి పరిహారం అందివ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
భూములు కోల్పోయిన భూనిర్వాసితులు మరో ప్రాంతంలో భూములు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ నుంచి అందే పరిహారం ఆలస్యం కావడం వలన భూ నిర్వాసితులు నష్టపోతున్నారని.
భూముల ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తీసుకున్న భూమి కంటే అదనంగా కాంట్రాక్టర్లు రైతుల భూములను ఆక్రమిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.అనంతరాం కలెక్టరేట్ వెళ్లి వినతిపత్రం అందజేసారు
ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం నేతలు కేశవ్ నర్సప్ప, కృష్ణయ్య, మహేష్ గౌడ్భూ నిర్వాసితులు పాల్గొన్నారు