The history of exploitation must be changed

దోపిడి చరిత్రను మార్చాలి

The history of exploitation must be changed.
The history of exploitation must be changed.

మన దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గం గా ధనికులు కార్మిక వర్గాన్ని, అగ్రకులాలు నిమ్న కులాలను అణిచివేయడం లేదా సామాజికంగా వెలివేయడం జరిగింది. పురుషాదిక్యఅహంకారం తో మహిళలను వివక్షత తో చూడడం ఇటువంటి చరిత్ర చాలా ఉన్నదని ఈ చరిత్రను మార్చాలని అందుకు మనమందరం సిద్ధం కావాలనీ, అందరూ సమానంగా ఉండే సమసమాజం కోసం పోరాడాలని సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సూర్యం పిలుపునిచ్చారు.
బుధవారం స్థానిక భగత్ సింగ్ భవన్ లో జరిగిన పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులలో *భారతదేశ చరిత్ర.* అనే అంశం బోదిస్తూ మనదేశంలో ఏర్పడినటువంటి చాతుర్వర్న వ్యవస్థ పై వర్ణాలు కింది వర్ణాలపై అనేక రకాలుగా వివక్షతలు చూపుతూ సామాజికంగా వెలివేసి ఆత్మగౌరవం లేకుండా చేసాయి. రాజరిక వ్యవస్థలో రాజులు ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా బానిసలుగా మార్చుకొని పరిపాలించారు.
పదహారు వందల సంవత్సరంలో వ్యాపారం పేరుతో బ్రిటిష్ వాళ్లు ప్రవేశించి అన్ని రకాలుగా దోచుకున్నారు పూర్తిగా ఆర్థికంగా,మానసికంగా భారతీయులను లోబర్చుకొని దేశ సంపదను ఇంగ్లాండ్ కు తరలించి దేశాన్ని ఆర్థికంగా బలహీనపరిచారు ఇక్కడి ముడి సరుకును తీసుకెళ్లి తమ పరిశ్రమాల్లో సరుకుగా తయారు చేసిన వస్తువులను ఇక్కడ అమ్ముకొని దేశాన్ని మార్కెట్ గా మార్చారు. వారికి బానిసలుగా ఉండడానికి వారి అనుకూల విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టారు.
1947లో అధికార మార్పిడి జరిగిన తర్వాత మన దేశ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఉపశమనం కలిగించే పథకాలు ప్రవేశపెట్టి, నిర్మాణాలు చేపట్టి ఇదే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెట్టారు. కేవలం వాళ్ల రాజకీయ మనుగడ, ఓట్లు పొందడం కోసం అభివృద్ధి పేరుతో వివిధ రకాల పనులు చేయడం, పథకాలు ప్రవేశపెట్టడం చేశారు, అనేక రకాలుగా కుంబకోణాలు చేసి దేశ సంపదను తమ స్వంత జేబుల్లోకి మార్చుకున్నారు. అంతేకానీ నిజంగా ప్రజలను అభివృద్ధి వైపు నడిపించాలనే చిత్తశుద్ధి నాటి నుండి నేటి వరకు పాలక వర్గాల్లో ఎక్కడ కనిపిస్తలేదు అన్నాడు. నాటి కాంగ్రెస్ మోసాలను అవినీతని ఆసరాగా చేసుకొని 2014 లో అధికారం లోకి వచ్చిన మోడీ దేశ సంపదను ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తున్నాడు. దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని సామ్రాజ్యవాదైన అమెరికా ముందు తాకట్టు పెట్టాడు నిత్యం దేవుడిని మతాన్ని రాజకీయాల్లోకి లాగుతూ తన రాజకీయ అవసరాలను తీర్చుకుంటున్నాడు. మహిళలపై లైంగిక హింస జరిగిన, నిమ్న కులాలపై అగ్రవర్ణాల దాడులు జరిగిన ఎక్కడ కూడా నోరు విప్పడం లేదు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహ, ఉపా కేసులు పెట్టి అనేక నిర్బంధాలకు గురి చేస్తున్నాడు.
కావున నేటి ప్రజలు మతాన్ని కులాన్ని వదిలేసి పాలక వర్గాల మోసాలను అర్థం చేసుకొని సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు దోచుకుంటున్నటువంటి విధానాన్ని ప్రశ్నించాలని అన్నారు. ఈ దోపిడీ విధానం లేని సమసమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ తరగతులలో పార్టీ జిల్లా కార్యదర్శి బి. రాము జిల్లా నాయకులు సలీం, కె. కాశినాథ్, బోయిన్ పల్లి రాము, బి. యాదగిరి, కిరణ్, బి. నర్సింహా, పి.రామకృష్ణ, కొండా నర్సిములు, ఛన్నారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment