
నారాయణపేట: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని జిల్లా మైనారిటీ అధికారి ఎంఏ రషీద్ తెలిపారు. మంగళవారం జిల్లా మైనారిటీ అధికారి నారాయణపేట లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ బాయ్స్ సందర్శించి విద్యార్థులకు బెడ్ షీట్లు ప్లేట్లు , టవల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఏ రషీద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు దుస్తులు కాస్మెటిక్స్ నాణ్యమైన భోజనం ఇతర వసతులు కల్పించి వారికి కృషి చేస్తున్నదని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని విద్యలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహబూబ్ ఖాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.