Let us unite for workers’ rights.

◆ కార్మిక హక్కుల కోసం ఒక్కటిగా కదులుదాం.
◆ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో విజయవంతం చేద్దాం.
ఆగస్టు 10న దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో జరుగు జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం , ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి మీస్కిన్ పిలుపునిచ్చారు.
బుధవారం రోజు నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య అధికారి చంద్రమోహన్ గారికి వినతి పత్రం అందజేశారు .
ఆగస్టు 10న జిల్లా వ్యాప్తంగా అన్ని పి హెచ్ సి పరిధిలలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు అందరూ జైల్ భరో కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మిక వర్గం హక్కులను కాలరాస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు .
సంఘం పెట్టుకునే హక్కు ,సంఘటితంగా పోరాటం చేసే హక్కు , కనీస వేతనం, ఉద్యోగ భద్రత తదితర హక్కులన్నీ ఈ లేబర్
కోడ్ లు హరించి వేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని జైల్ బరో కార్యక్రమం చేయనున్నట్లు వారు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు మండల కార్యాలయాల ముందు ధర్నాలు విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఎం సోషల్ మీడియా నారాయణపేట పట్టణ కన్వీనర్ సోఫీ మజార్ హుస్సేన్ ,ఆశా యూనియన్ నాయకులు విజయలక్ష్మి మమత శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment