A suitable site must be allocated for employment scheme workers.

ఉపాధి కూలీల కొరకు ముఖ్యమైన కడలి స్థలం కేటాయించాలి
నారాయణపేట జిల్లా పట్టణమునందు నారాయణపేటకు ఉపాధి కొరకు వచ్చే వ్యవసాయ రైతు కూలీలు. మేస్త్రి కూలీలు . వివిధ రకాల కార్మికులు ప్రతిరోజు నారాయణపేటకు ఉపాధి కొరకు వస్తుంటారు కానీ వారికి సరైన పట్టణంలో స్థలాలు లేక ఏ ప్రాంతంలో ఏ వార్డులో ఉపాధి కొరకు పనికి వెతుకుతుంటారు వారందరి కొరకు నారాయణపేట ముఖ్యమైన స్థలంలో ప్రభుత్వం చూయించినట్లయితే అందరి అవసరాల కొరకు రైతులు అక్కడ ఉపాధి కూలీలను మాట్లాడి తమ యొక్క పొలాలకు గాని వ్యాపారాలకు స్థలాలకు గాని మేస్త్రి పనికి గాని వివిధ ఫంక్షన్లలో ఉపాధి పనికొరకు ఒక అడ్డ అవసరం ఉన్నది ఇది రైతులకు ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఒకే స్థలం కు పని కొరకు వస్తే ఇక్కడ పని ఉపాధి కూలీలు దొరుకుతారని అక్కడనే వెతుకుతారు పని అవసరం ఉన్నోళ్లు వెంటనే కూలి మాట్లాడుకుని తమ పనికి వెళ్ళిపోతారు కాబట్టి ఉపాధి కూలీల కొరకు ప్రభుత్వం కూడా సహకరించినట్లు అవుతుందని భారతీయ కిసాన్ సంఘ ద్వారా నారాయణపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నందు మార్కెట్ చైర్మన్ సదాశివ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది ఇట్టి విషయాన్ని మున్సిపాలిటీ చైర్మన్ కి కూడా దృష్టిలో తీసుకొని వస్తున్నాము కాబట్టి అందరూ కూడా ఇట్టి విషయాన్ని అందరూ సహకరించాలి పార్టీలకు అతీతంగా ఉపాధి పొందు వ్యక్తులకు భరోసా ఇచ్చినట్లు అవుతుంది ఇట్టి విషయాన్ని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రజల తరఫున రైతుల తరఫున దృష్టికి తెలుపుతున్న వారు భారతీయ కిసాన్ సాంగ్ తరపున రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబా. జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి. జిల్లా ఉపాధ్యక్షుడు క్యాతంపల్లి శరణమయ్యప్ప జిల్లా సహకార దర్శి ప్రభు మిస్కిన్. నగర అధ్యక్షుడు ఆకుల వెంకటప్ప పేరపళ్ళ మాజీ సర్పంచ్ శంకర్. మేస్త్రి సంఘం నాయకుడు బుర్ర బసప్ప. ఆనాసారం బాల్రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a Comment