Anwar Sadath suspended from NSUI

NSUI నుండి అన్వర్ సాదత్ సస్పెన్షన్

నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామి ఆదేశాల మేరకు, సంస్థ క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో శ్రీ అన్వర్ సాదత్‌ను NSUI సంస్థ నుండి తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తున్నట్లు NSUI వింజమూరి దామోదర్ రెడ్డి తెలిపారు.

సంస్థ సిద్ధాంతాలు, నియమ నిబంధనలు మరియు క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, అలాగే యూనియన్‌ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

NSUI అనేది విద్యార్థుల హక్కులు, సంక్షేమం మరియు ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేసే విద్యార్థి సంస్థ అని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థ పేరును లేదా వేదికను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కూడా సంస్థ నియమాలను ఉల్లంఘించే వారిపై ఇదే విధంగా క్రమశిక్షణా చర్యలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

Leave a Comment