Awareness of cybercrimes is the best defense.

సైబర్ నేరాలపై అవగాహనే ఉత్తమ రక్షణ – ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS

నారాయణపేట: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, ఆన్‌లైన్ మోసాల నుంచి అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో నేడు తేదీ:05.08.2026 బుధవారం రోజు ఉదయం 10:00 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్స్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై సైబర్ నేరాల నివారణపై అవగాహన పొందాలని ఎస్పీ కోరారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ CH ప్రియాంక మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి సుమారు 1,500 మంది హాజరుకానున్నారు. వారిలో గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళా సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొంటున్నారు.
కార్యక్రమ ఏర్పాట్లను DCRB డీఎస్పీ మహేష్, డీఎస్పీ నల్లపు లింగయ్య పరిశీలించి, అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని టౌన్ సీఐ శివశంకర్, టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యలక్ష్మి రెడ్డిలకు సూచించారు.
జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమంలో పాల్గొని సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Leave a Comment