
ప్రమీల ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం – మొబైల్ యాప్ ఆవిష్కరణ
సమాజ సేవే ధ్యేయంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రమీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి సహాయకులు మరియు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల ఫౌండేషన్ మొబైల్ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రమీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. కోరం మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. సమాజంలోని నిరుపేదలు, ఆపదలో ఉన్నవారు మరియు అవసరమైన వారికి తమ వంతు సహాయం అందించేందుకు ప్రమీల ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలకు ఫౌండేషన్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాల సమాచారం, సభ్యత్వ నమోదు, స్వచ్ఛంద సేవా అవకాశాలు మరియు ఇతర సేవలను సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రమీల ఫౌండేషన్ మొబైల్ యాప్‌ను రూపొందించి అధికారికంగా ఆవిష్కరించినట్లు డా. కోరం మహేష్ రెడ్డి తెలిపారు.