ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి* ——– జిల్లా కలెక్టర్ ప్రియాంక. నారాయణపేట జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక లబ్ధిదారులకు సూచించారు. దశలవారీగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా మంజూరవుతాయని ఆమె తెలిపారు. మంగళవారం మద్దూరు (మండలం)మున్సిపాలిటీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు గృహప్రవేశం పూర్తయిన మరో ఇంటిని జిల్లా … Read more
mana narayanpet tv
Distribution of nano-fertilizers and PSB to farmers
రైతులకు నానో ఎరువులు, పీఎస్‌బీ పంపిణీ సింగారంలో రైతులకు అవగాహన – క్షేత్రస్థాయిలో వినియోగంపై ప్రదర్శన. నారాయణపేట మండలం సింగారం గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK), నారాయణపేట ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ మరియు ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బయోఫెర్టిలైజర్ (PSB)లను పంపిణీ చేశారు. TRVK నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ రైతులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా డా. సత్యనారాయణ మాట్లాడుతూ, నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం ద్వారా … Read more
Distribution of bedsheets, plates, and towels to students.
నారాయణపేట: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని జిల్లా మైనారిటీ అధికారి ఎంఏ రషీద్ తెలిపారు. మంగళవారం జిల్లా మైనారిటీ అధికారి నారాయణపేట లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ బాయ్స్ సందర్శించి విద్యార్థులకు బెడ్ షీట్లు ప్లేట్లు , టవల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఏ రషీద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి … Read more
మరికల్ SHO గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై M. విక్రమ్
మరికల్ SHO గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై M. విక్రమ్ నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ M. విక్రమ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మరికల్ ఎస్సైగా విధులు నిర్వహించిన రాములు నగర్ కర్నూలు జిల్లా తడూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై విక్రమ్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారిని ఎస్పీ కార్యాలయంలో పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా … Read more
వలసల జిల్లాగా ఉన్న నారాయణపేట ను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశం
నారాయణపేట జిల్లా :పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక,యువజన సేవలు, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ … Read more
కొత్త అవకాశాలు దివ్యాంగుల జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు
నారాయణపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్” లో భాగంగా నారాయణపేట జిల్లా గాయత్రి ఫంక్షన్ హాల్, నారాయణపేటలో జిల్లా సంక్షేమ శాఖ మరియు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాకు చెందిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, విశిష్ట అతిథిగా … Read more