Collector conducts surprise inspection of Damaragidda Tahsildar office.

దామరగిద్ద తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ నారాయణపేట జిల్లా దామరగిద్ద తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ (డీటీ) ఇద్దరూ లేకపోవడంతో వారు ఎక్కడికి వెళ్లారని సీనియర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. వారు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినట్లు సీనియర్ అసిస్టెంట్ వివరించారు. అనంతరం రిజిస్ట్రేషన్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, మంగళవారం ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. … Read more

  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి* ——– జిల్లా కలెక్టర్ ప్రియాంక. నారాయణపేట జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక లబ్ధిదారులకు సూచించారు. దశలవారీగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా మంజూరవుతాయని ఆమె తెలిపారు. మంగళవారం మద్దూరు (మండలం)మున్సిపాలిటీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు గృహప్రవేశం పూర్తయిన మరో ఇంటిని జిల్లా … Read more

Distribution of nano-fertilizers and PSB to farmers

రైతులకు నానో ఎరువులు, పీఎస్‌బీ పంపిణీ సింగారంలో రైతులకు అవగాహన – క్షేత్రస్థాయిలో వినియోగంపై ప్రదర్శన. నారాయణపేట మండలం సింగారం గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK), నారాయణపేట ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ మరియు ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బయోఫెర్టిలైజర్ (PSB)లను పంపిణీ చేశారు. TRVK నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ రైతులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా డా. సత్యనారాయణ మాట్లాడుతూ, నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం ద్వారా … Read more

Distribution of bedsheets, plates, and towels to students.

నారాయణపేట: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని జిల్లా మైనారిటీ అధికారి ఎంఏ రషీద్ తెలిపారు. మంగళవారం జిల్లా మైనారిటీ అధికారి నారాయణపేట లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ బాయ్స్ సందర్శించి విద్యార్థులకు బెడ్ షీట్లు ప్లేట్లు , టవల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఏ రషీద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి … Read more

Farmers losing their lands have not received even a single penny to this day.

◆ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందించాలి . ◆ భూనిర్వాసితుల ధర్నా ◆ భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్  నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందివ్వాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు . బుధవారం రోజు ఆ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర … Read more